Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇంత పెద్ద అవకాశం వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు!: 'జబర్దస్త్' మహేశ్‌

  • 'రంగస్థలం'లో నటించాను
  • చ‌ర‌ణ్ వంటి పెద్ద స్టార్ పక్కన న‌టిస్తాన‌ని అనుకోలేదు
  • చాలా మంది అభినందిస్తున్నారు
తాను రామ్ చ‌ర‌ణ్ తేజ్ వంటి పెద్ద స్టార్ పక్కన న‌టిస్తాన‌ని ఎప్పుడూ ఊహించలేదని 'జ‌బ‌ర్ద‌స్త్' నటుడు మ‌హేశ్ అన్నాడు. ఇటీవ‌ల విడు‌ద‌లైన రంగ‌స్థ‌లం సినిమాలో రామ్ చ‌ర‌ణ్ తేజ్ మిత్రుడి పాత్ర‌లో మ‌హేశ్ క‌న‌ప‌డ్డాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ... రంగ‌స్థ‌లం వంటి పెద్ద సినిమాలో త‌న‌కు అవ‌కాశం వ‌చ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు.

ఈ సినిమాలో న‌టించిన త‌రువాత త‌న‌కు చాలా మంది అభినంద‌న‌లు తెలప‌డానికి కాల్స్ చేస్తున్నార‌ని అన్నాడు. వస్తున్న ఫోన్ కాల్స్ మాట్లాడి మాట్లాడి మొబైల్ స్విచ్ఛాఫ్ అవుతోంద‌ని చెప్పాడు. కాగా, ఈటీవీలో ప్ర‌సార‌మ‌య్యే జ‌బ‌ర్ద‌స్త్ లో న‌టించి మంచి పేరు తెచ్చుకున్న మ‌హేశ్.. చిరంజీవి న‌టించిన ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాలోనూ ఓ చిన్న పాత్రలో నటించాడు. 
mahesh
rangasthalam
Ramcharan

More Telugu News